ప్రజా సమస్యలు వద్దు కానీ జీతాలు మాత్రం కావాలి.. : చంద్రబాబు

Thursday, September 6th, 2018, 03:58:18 AM IST

నేడు అమరావతి లో జరిగిన విస్తృత స్థాయి సమావేశం లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల విమర్శలు గుప్పించారు. భాద్యత గల పదవుల్లో ఉండి వారి కర్తవ్యాలను నిర్వహించకుండా అసెంబ్లీ నుంచి బయటకి వెళ్లి ప్రజల సమస్యల పట్ల పోరాటం చెయ్యకుండా జీతాలు తీస్కుంటున్నారని విమర్శలు చేశారు. ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని ఒక రూపు సంతరించుకుంటుంది అని, మరొక పదిహేనేళ్లల్లో రాజధాని పూర్తి అవుతుందని తెలిపారు. అమరావతి బాండ్ల విక్రయం ద్వారా 2 వేల కోట్లు వచ్చాయని తెలియజేసారు.

గడిచిన నాలుగేళ్లలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఇప్పుడు జరిగింది అని, ఆంధ్ర రాష్ట్రంలో గల అన్ని గ్రామాలకి కలిపి దాదాపు 30 లక్షల ఎల్ఈడి బల్బులు అందజేశాం అని, ఎన్నికల మానిఫెస్టోలో లేనటువంటి ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాము అని, ముఖ్యంగా అన్నా కాంటీన్లకు అద్భుత స్పందన వస్తుంది అని వచ్చే జనవరి నాటికి మొత్తం 300 అన్న కాంటీన్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ప్రతిపక్షము వారు చేసే నాటకాలు, కుట్రలు పన్నాగాలు నా దగ్గర కుదరవని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోగా పీ డి పై విమర్శలు చెయ్యడం తగదని సూచించారు. ప్రత్యేక హోదా సాధనకు యువత వారి ప్రాణాలను తీసుకోవద్దని కేంద్రం తో పోరాడి సాధిద్దాం అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments