జగన్,బీజేపీ పార్టీలకు ఒకేసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాబు..!

Tuesday, September 11th, 2018, 02:15:41 AM IST


ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆ సమావేశాల్లో బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న సంఘర్షణలు కూడా తెలిసినవే.. ఐతే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఘాటు గానే వారి స్పందనను వ్యక్తపరిచారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అనంతరం బీజేపీ నాయకుడు అయినటువంటి విష్ణు కుమార్ రాజు వైస్ జగన్ కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు..

దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లేచి గత 2014 కంటే ముందు నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి అని, వారు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరం లోపల అవినీతి పరులు అందరిని దోషులుగా బోనులో నిలబెడతారని, వారి యొక్క నల్ల డబ్బు అంతటిని స్విస్ బ్యాంకు నుంచి తీసుకువస్తాను, అని మీ అందరి అకౌంట్లలో వేస్తాను అని చెప్పిన మీరు ఇప్పుడు వైస్ జగన్ తో కలిసి అతని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల కేసులు అన్నిటిని విలీనం చేస్తున్నారని, నేను అలా మీకు చూపించినట్టైతే మీ పదవికి రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు. చేతిలో అధికారం ఉంది కదాని ఇన్కం టాక్స్ ని సిబిఐ ని వారి స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చెయ్యకూడదు అని బలంగా తెలిపారు.

జగన్ మరియు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అనే ముసుగు వేసుకున్నారు అని ముందు ఆ ముసుగు తియ్యాలని తెలిపారు. అవినీతి చేసిన వారిని కాపాడుతున్నారని చేయనటువంటి వారిపై కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని ఇద్దరికీ కలిపి ఒకేసారి తనదైన శైలి లో కౌంటర్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments