ప్రభుత్వ అధికారుల పట్ల సంచలన నిర్ణయం : చంద్రబాబు

Saturday, September 8th, 2018, 04:14:22 PM IST

మొన్న ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ప్రజలు మలేరియా,డెంగ్యూ మరియు విష జ్వరాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యిన సంగతి తెలిసినదే, ముఖ్యంగా అటవీ ప్రాంత ప్రజలు సరైన వైద్యం అందక కొంత మంది మృతి చెందారని కూడా తెలుసు అయితే ఈ అంశం మీద ప్రభుత్వం విఫలం అయ్యిందని వార్తలు కూడ బలంగా వినిపించాయి.

దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి టెలీ కాన్ఫెరెన్సులో చర్చిస్తూ కొంత మంది భాద్యతా రాహిత్య అధికారుల వల్లనే ఇలా జరుగుతుంది అని వారి మీద మండిపడ్డారు. ఆ జిల్లాల్లోని ముఖ్యంగా మలేరియా డెంగ్యూ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న చోట పారిశుధ్య పనులు వారి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ మార్పు రాకపోతే వారిని ఉపేక్షించేది లేదు అని, వచ్చే సోమవారం కల్లా అక్కడి పరిస్థితులు మెరుగు పడకపోతే ఆ స్థానిక అధికారులను ఉన్నఫలంగా విధి నిర్వాహణ లోనుంచి తప్పిస్తాం అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ లు ప్రజలలోకి వెళ్ళాలి అని వారి యోగ క్షేమాలు ఎలా ఉన్నాయో కనుక్కోవాలి అని, వివరణలు సంజాయిషీలు వద్దని ఆచరణలో పెట్టాలి అని చంద్రబాబు సూచించారు ఎవరైనా విధి నిర్వహణ సరిగ్గా చెయ్యకపోతే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు

  •  
  •  
  •  
  •  

Comments