నారా భువనేశ్వరి అంత చేశారా..!

Sunday, January 14th, 2018, 10:00:51 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి ప్రస్తావన తీసుకుని వస్తుంటారు. ఆమె సహకారంతోనే ఇన్నిరోజులు తాను కష్టపడగలుగుతున్నాని చంద్రబాబు ఇది వరకే వివరించారు. మరో మారు చంద్రబాబు భువనేశ్వరి పై ప్రశంసల జల్లులు కురిపించారు. చంద్రగిరిలో తన హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించిన తరువాత చంద్రబాబు తన సతీమణిని ఉద్దేశించి మాట్లాడారు.

దాదాపు 21 ఏళ్ల తరువాత చంద్రబాబు హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించడం విశేషం. తన సతీమణి భువనేశ్వరి వల్లే హెరిటేజ్ ఈ స్థాయికి చేరిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత లక్షాలతో ముందుకు సాగె వారికీ, సామజిక భాద్యత కనబరిచేవారికి అవార్డులు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఇంధన పొదుపు విషయంలో హెరిటేజ్ ఉద్యోగులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సంక్రాంతి చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారి పల్లికి చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.