రోజాని అలా చేయడమే కరెక్ట్..!

Tuesday, February 14th, 2017, 08:41:41 AM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు లు వారి పై వచ్చిన విమర్శలకు నిన్నవేరు వేరు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. కోడెల మాట్లాడుతూ .. తాను ఆడ బిడ్డలగురించి తక్కువ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే స్పీకర్ పదవి కే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని ఆయన అన్నారు. తన మాటలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. నరసారావు పేటలో ఐదురోజులపాటు జరిగిన ఖేలో ఇండియా జాతీయ క్రీడలు పండుగ వాతావరణం లో జరిగాయని వాటిపై రాజకీయం చేయడం సరికాదని అన్నారు. వాటి కోసం చందాలు వసూలు చేశారనడం సరికాదని ఆయన అన్నారు.

కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడెల వ్యాఖ్యలను సమర్థించారు. కోడెల వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన అన్నారు. మీడియాలో ఇష్టం వచ్చినల్టు దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటేరియన్ సదస్సుకు రాబోయిన రోజని అడ్డుకోవడంపై కూడా చంద్రబాబు సచివాయలయంలో మాట్లాడారు. వచ్చి గొడవ చేస్తామంటే పోలీస్ లు చర్యలు తీసుకోరా అని అన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సుని డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నించారని అందుకే పోలీస్ లు వారిపనిని వారు చేశారని చంద్రబాబు అన్నారు.