ఇరువైపులా చెలరేగిపోతున్నారు..నీ సందడేది పవన్..!

Tuesday, January 16th, 2018, 04:59:05 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ మేరకు సంక్రాంతి పండగ సంతోషంగా జరుపుకున్నారో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం జబర్దస్త్ గా సంక్రాంతికి సందడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె లో గత వారం రోజులుగా సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. కుటుంబ సమేతంగా చంద్రబాబు నారావారి పల్లెలో పర్యటించారు. ప్రతి పక్ష నేత జగన్ కూడా అదే జిల్లాలో ఆ మాటకి వస్తే అదే నియోజకవర్గంలో నారా కుటుంబానికి ధీటుగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయత్రని కొనసాగిస్తున్నారు. నారావారి పల్లి ఉండే చంద్రగిరి నియోజకవర్గంలోనే జగన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం విశేషం.

తెలుగువారు ఘనంగా జరుగుకునే పండగ సంక్రాంతి కావడంతో ఈ బడా నేతలు ఇద్దరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సెంటిమెంట్ పరంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఈ అవకాశాన్ని జనసేన పార్టీ మాత్రం వదిలేసుకుంది. మాకు పలానా సమస్య ఉంది అని ఎవరైనా జనసేన పార్టీ గుమ్మం తొక్కితే కానీ బయటకు కనిపించని పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే సైలెంట్ అయిపోయారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, ఒంగోలు పర్యటనలో ఆ మధ్యన పవన్ కళ్యాణ్ హోరెత్తించారు. అజ్ఞాతవాసి సినిమా విడుదలైనా పవన్ కళ్యాణ్ అదే సైలెంట్ మైంటైన్ చేయడం గురించి జనసేన వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో చెలరేగిపోతున్న వేళ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ సస్పెన్స్ కి ఎప్పు తెరదించుతారో అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.