చంద్రబాబు, కేసీఆర్ మమ్మల్ని గెలిపిస్తారు : మాజీ ప్రధాని!

Tuesday, May 8th, 2018, 01:44:08 PM IST

ఈనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ తదితర పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తామే మంచి మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ అధినేత దేవెగౌడ అన్నారు. అంతేకాదు ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికే ప్రజలు తమవైపు వున్నారని, అలానే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ ల మద్దతు తమకు ఉందని, వారు మమ్మల్ని గెలిపిస్తారని జోస్యం చెప్పారు.

ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో తాము ముందంజలో ఉంటామని అన్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సర్వే ల ఆధారంగా చూస్తే కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని, జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ గా నిలుస్తుందని ఎక్కువశాతం సర్వే లు చెపుతుండడం గమనార్హం. అయితే దేవెగౌడ లానే ఆయన కుమారుడు కుమారస్వామి కూడా సర్వే లు చెపుతున్నట్లు తాము కింగ్ మేకర్లము కాదని, కింగులం అని, చూస్తూ వుండండి ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments