ఆడవారి జోలికెళ్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి: సీఎం

Sunday, May 6th, 2018, 03:45:43 AM IST


దాచేపల్లి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటన సమాజానికే మాయని మచ్చ అని సోమవారం నాడు జరిగే ప్రజా చైతన్య ర్యాలీని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని సీఎం నేడు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు ఇకపై రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అదే విధంగా జీవితం చాలా విలువైంది. నైతిక విలువలు పెంచుకోవాలి, నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నియంత్రించాం. ఇప్పుడు లైంగిక వేధింపులపై కూడా నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన సమయం. అరాచకాలను ప్రతిఘటించాలి, ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం కలగాలి.’ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం’ ర్యాలీలో అందరూ పాల్గొనాలి అంటూ.. చట్టాలు కఠినంగా రూపొందిస్తున్నాం, నిందితులు ఎవరైనా సహించేది లేదు. పోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై కూడా ప్రజల్లో అవగాహన పెరగాలని తెలిపారు.