నిప్పులా బ్రతికాను.. దేశంలో నేనే ఫస్ట్ : చంద్రబాబు

Thursday, March 8th, 2018, 01:58:49 AM IST

రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంపై గత కొంత కాలంగా టీడీపి నేతలు ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తోన్న సంగతికి తెలిసిందే. అయితే చాలా వరకు ప్రస్తుతం టిడిపి వైసిపి నేతలు బీజేపీ పై పోరాటానికి భయపడుతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. కేసులు ఉన్నందున బీజేపీ ని గట్టిగా నిలదీయలేకపోతున్నారని ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు పై కూడా కొన్ని కామెంట్స్ రావడంతో ముఖ్యమంత్రి గట్టిగా కౌంటర్ వేశారు.

ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాపై ఎలాంటి కేసులు లేవు. నిప్పులా బ్రతికాను. ఎవరికీ భయపడాల్సిన అవసరం ఎంత మంత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో ఎక్కడా రాజీపడలేదు. లాలూచీ పాలిటిక్స్ ఎన్నడు చేయలేదు. ఇప్పుడున్న సీనియర్ నేతల్లో నేనే అగ్రస్థానంలో ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు కేద్రాన్ని ఎప్పుడు నిధులు అడగలేదు. సమైక్య స్ఫూర్తికే కట్టుబడి ఉన్నా. కష్టాల్లో ఉన్నాము కాబట్టే సహకరించాలని కోరుతున్నట్లు చంద్రబాబు మాట్లాడారు. అంతే కాకుండా నిధులు ఇవ్వకపోయినా అభివృది ఆగదని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు.