గల్లీ కేసులో బాబుపై అరెస్ట్ వారెంట్.. నవ్వుకుంటున్న తెలుగు జనం !

Friday, September 14th, 2018, 04:14:39 PM IST

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడ చిన్నపాటి ధర్నా చేశారన్న గల్లీ స్థాయి కేసులో కావడం విశేషం. దేశం మొత్తం మీద ఒక రోజులో ఎంతో ముందటి ప్రజాప్రతినిధులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం, వారిని పోలీసులు అప్పటికప్పుడు అరెస్ట్ చేసి జరిమానా వేసి ఆ వెంటనే వదిలేయడం జరుగుతూనే ఉంటాయి. అసలు ఇలాంటి కేసులు కోర్టుల వరకు వెళ్లవు. పోలీస్ స్టేషన్లోనే సెటిలైపోతుంటాయి. అలాంటి కేసులో ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై ఏకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవడం ఏమిటని రాష్ట్ర ప్రజానీకం నవ్వుకుంటున్నారు.

2010లో మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్టు ఎత్తును పెంచడంపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ స్పందించడంలేదనే కారణంగా చంద్రబాబు టీడీపీ తరపున నిరసనగా దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వంటి వారిని వెంటేసుకుని 144 సెక్షన్ అమలులో ఉన్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించి, అక్కడే బైఠాయించి నీరసం చేశారు. దీంతో అక్కడి పోలీసులు తమ విధులకు అడ్డొస్తున్నారని చంద్రబాబు అండ్ టీమ్ పై కేసు నమోదు చేశారు.

ఆ సమయంలోనే మన వాళ్లకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులందాయి. అప్పుడే మన వారి తరపున లాయర్ అక్కడికి వెళ్లి వివరణ ఇచ్చి ఉంటే ఈపాటికి కేసు మూతపడేది. కానీ అలా జరగలేదు. దాదాపు 8 ఏళ్ల తరవాత ఎవరో దారిన పోయే దానయ్య ధర్మాబాద్ కోర్టులో ఆ కేసు ఏమైందంటూ పిటిషన్ వేయడం, దాన్ని విచారించిన న్యాయస్థానం ఉన్నట్టుండి అరెస్ట్ వారెంట్ జరీ చేయడం వంటివి చాలా నాటకీయంగా కనిపిస్తున్నాయి. మనవాళ్ళేమో ఇదంతా మోదీ కుట్రని, ఎదురురిగినందుకు బాబుపై వ్యక్తిగత కక్ష సాధింపని అంటున్నారే కానీ ఇన్నేళ్ల నుండి ఆ కేసును ఎందుకు నెత్తినే పెట్టుకుని ఊరేగుతున్నారో చెప్పడంలేదు.

  •  
  •  
  •  
  •  

Comments