2019 ఎల‌క్ష‌న్స్.. టీడీపీ కొంప కొల్లేరే.. చంద్ర‌బాబు అతి పెద్ద పెయిల్యూర్ అదే..!

Monday, April 22nd, 2019, 01:28:45 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. అయితే ఫ‌లితాల కోసం మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతోంది. ఈ క్ర‌మంలో పెరిగిన ఓటింగ్ శాతంతో గెలుపు ఓట‌ముల పై ఎవ‌రికి వారు లెక్కులు వేసుకుంటున్నారు. మ‌రోసారి అధికారంలోకి టీడీపీనే వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతుంటే, ఈసారి వైసీపీ గెలుపు ఖాయ‌మైంద‌ని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక మ‌రోవైపు జ‌న‌సేన కూడా త‌మ‌కే గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయిని అంటుంది.

ఇక అస‌లు మ్య‌ట‌ర్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్ర‌బాబు గెలుపు పై లోప‌ల ఎలాంటి టెన్ష‌న్ ఉన్నా తామే గెలుస్తామ‌ని టీడీపీకి పైగానే 130 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. దానికి కార‌ణం ఏంటంటే టీడీపీ ఓడిపోతే రాజ‌ధాని ఆగిపోతుంద‌ని, పోల‌వ‌రం ఆగిపోతుంద‌ని, అంతే కాకుండా తాను ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ళాయ‌ని, ముఖ్యంగా ప‌సుపు కుంకుమ ప‌థ‌కం వ‌ల్ల మ‌హిళ‌లు టీడీపీకే ఓట్లు వేశార‌ని, త‌న ఒక్క పిలుపుతో ఇంటికి వెళ్ళిన వారు కూడా మ‌ళ్ళీ వ‌చ్చి ఓట్లు వేశార‌ని అందుకే త‌మ‌గెలుపు ఖాయ‌మంటున్నారు చంద్ర‌బాబు.

అయితే టీడీపీ అతి విశ్వాసం పై ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విప‌రీత‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఐదేళ్ళ కాలంలో టీడీపీ వ‌ల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని, పోల‌వ‌రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగ‌లేద‌ని, రాజ‌ధాని నిర్మాణం అదొక గ్రాఫిక్స్ అని, ఇక ప‌థ‌కాలు అంటారా నాలుగున్న‌ర ఏళ్ళుగా టీడీపీ ప్ర‌జ‌లు ఏమాత్రం గుర్తు కూడా లేర‌ని, చివ‌ర్లో ఎన్నిక‌ల టైమ్‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభపెట్టేందుకు ప‌లు ప‌థాకాలు ప్ర‌వేశ‌పెట్టి ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. వాటిలో ప‌సుపు కుంకుంమ ఒక‌టి.

ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి నిమిషంలో పసుపు-కుంకుమ కింద మహిళలకు పది వేల రూపాయల ప్రజల సొమ్మును చంద్రబాబు పంచారు. అయితే డ్వాక్రా మ‌హిళ‌ల‌ను పూర్తిగా విస్మ‌రించిన చంద్ర‌బాబు స‌ర్కార్‌, ఒక్క‌సారిగా క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల టైమ్‌లో చంద్రబాబు ప్ర‌క‌టించిన తాయిలాల‌కు లొంగి ఎడాపెడా ఓట్లు వేస్తార‌నేది అనుమాన‌మే. అయితే కేవ‌లం ప‌సుపు కుంకుమ వ‌ల్ల ఓట్లు ప‌డే చాన్స్ లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా 40 ఇయ‌ర్స్ ఇండ‌ష్ట్రీ అయిన చంద్ర‌బాబు కేవ‌లం చివ‌రి నిముషంలో ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు త‌మ‌ని గెలుపిస్తాయ‌నడం, గెలుపు పై పూర్తిగా ఆ ప‌థ‌కం పైనే ఆధార‌ప‌డ‌డం చంద్ర‌బాబు హిస్ట‌రీలోనే అతి పెద్ద ఫెయిల్యూర్ అని రాకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.