చంద్రబాబు బయోపిక్ కూడా పూర్తవుతోంది!

Saturday, September 1st, 2018, 12:15:43 PM IST

దేశ వ్యాప్తంగా ఇప్పుడు అన్ని బాషల వారు ఎక్కువగా బయోపిక్ లనే ఇష్టపడుతున్నారు. కరెక్ట్ గా తెరకెక్కిస్తే సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని కొన్ని సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకంటే బయోపిక్ కథలకే ఎక్కువ ఆదరణ అందుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

ఇక చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల నటిస్తుండగా ఎన్టీఆర్ గా భాస్కర్ కనిపించనున్నారు.
పేద కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు విద్యార్థి నేత నుంచి రాజకీయ నేతగా ఎలా మారారు. ఎమ్మెల్యేగా అలాగే ముఖ్యమంత్రిగా ఏ విధంగా గెలిచారు అనే విషయాల గురించి సినిమాలో క్లుప్తంగా చూపెట్టనున్నారట. జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేనిదని దర్శకుడు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments