ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు పిలుపు !

Tuesday, April 24th, 2018, 12:10:28 AM IST

ప్రస్తుతం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ టిడిపిలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల కుమార్తె ప్రస్తుతం మంత్రి అఖిల ప్రియకు, అలానే అక్కడి ప్రస్తుత టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజానికి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి మంచి అనుచరుడిగా పేరున్న సుబ్బారెడ్డి ఆయనమరణాంతరం అక్కడినుండి బయటకి వచ్చారు. ఆ తదనంతరం అఖిల ప్రియను మంత్రిని చేసిన చంద్రబాబు సుబ్బారెడ్డికి కూడా రానున్న ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం పార్టీ కార్యక్రమం నిమిత్తం తన అనుచరులతో కలిసి ఆళ్లగడ్డ లో ర్యాలీ నిర్వహిస్తున్న సుబ్బారెడ్డి టీం పై అఖిల ప్రియా అనుచరులు కొందరు రాళ్ళూ రువ్వి ర్యాలీ ని చెదరగొట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటనపై సుబ్బారెడ్డి స్థానిక పోలీస్ లకు ఫిర్యాదుచేయగా అక్కడ దాడికి పాల్పడ్డ వారు అఖిలప్రియ అనుచరులని తేలినప్పటికీ ఆమె మంత్రి కావడంతో పోలీస్ లు కూడా ఆమె పై కేసు పెట్టేందుకు నిరాకరిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే అంతటితో ఆగని ఆయన వెనువెంటనే విషయాన్నీ టిడిపి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే ఆళ్లగడ్డ పరిస్థితిపై కొంత గుర్రుగా వున్నా బాబు రేపు ఇరువర్గాలను అమరావతి వచ్చి మాట్లాడవలసింది గా ఆదేశాలు జారీచేసినట్లు త్లెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments