చంద్రబాబు పూటకో మాట మారుస్తున్నాడు – ఆనం విమర్శలు

Monday, February 11th, 2019, 08:00:58 PM IST

చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షను తప్పుబడుతున్నారు వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి. మాట మీద నిలకడ లేని వ్యక్తికీ అనవసరమైన ఈ పోరాటాలు ఎందుకు అని ఆనం విమర్శించారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆరాటపడి ఇప్పుడు ఇంత సడన్ గా హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. అంతలా కావాలనుకుంటే ముందు నుండే హోదా కోసం పోరాటం చేస్తే బాగుండేది కదా అని అంటున్నారు. నేడు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆనం రామనారాయణరెడ్డి చంద్రబాబు పై విమర్శలు చేశారు. అసలు చంద్రబాబు కి ఢిల్లీ వెళ్లి దీక్ష చేయాల్సిన అవసరం లేదు. హోదా కోసం పోరాటం చేయడానికి చంద్రబాబు అనర్హుడు అని రామనారాయణ రెడ్డి అన్నారు. అంతేకాకుండా పోలవరం విషయంలో కేంద్రం నిధులను కాజేసి అవినీతికి పాల్పడ్డ వీరు కూడా ఇలా బయటకు పోరాటం చేస్తున్న వారిలాగా ప్రజలను మభ్యపెడుతున్నారని, అసలు చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని, తనకి నచ్చినట్లు మాట మార్చే వ్యక్తి అని ఆనం ఆరోపించారు.