జాతీయ మీడియానే చంద్రబాబు నమ్మించేసారు..పవన్..!

Friday, December 7th, 2018, 02:00:42 AM IST

ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీమాంధ్ర అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న అక్కడ కరువుప్రాంతాలకి వెళ్లి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా లైవ్ కూడా ఇచ్చి అక్కడి వాస్తవికతను చూపించి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యారు అని నిరూపించారు.అయితే ఈ రోజు నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీటింగులో పవన్,చంద్రబాబు మీద మరోసారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.చంద్రబాబు తన మాటల గారడితో ఎన్నో మాయలు చేస్తాడని,అన్ని పరిస్థితులు తనకి అనుకూలంగా మార్చేసుకుంటాడని అంటుంటారు.

ఇప్పుడు కూడా అదే మాటలను నిజం చేస్తూ చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియా వారిని కూడా మభ్య పెట్టేశారని పవన్ వ్యాఖ్యానించారు.తాను ఆ మధ్య ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించినప్పుడు అక్కడ మీడియా వారు చంద్రబాబు రైన్ గన్స్ అనే కొత్త టెక్నాలిజీ తో అనంతపురంలోని కరువుని పూర్తిగా జయించారంట కదా అని వారు తనని ప్రశ్నించారని.దానితో పవన్ అలాంటివేవి ఇక్కడ జరగలేదు అని చెప్పాలనుకున్నాని అంటూ చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియా వారిని కూడా తనకి అనుకూలంగా మభ్యపెట్టేసారని అనుకున్నానని పవన్ తెలిపారు.ఇక్కడ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే చంద్రబాబు ఏమో జాతీయ మీడియా వారికి ఇక్కడ కరువుని జయించేసాం చెప్పుకుంటూ తిరుగుతున్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.