జమిలి ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!

Friday, July 13th, 2018, 08:58:04 AM IST

దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల్లో గుబులు రేపుతోన్న అంశం ముందస్తు ఎన్నికలు. అధికారం కోసం అన్ని ప్రణాళికలు ముందే సిద్ధం చేసుకోవాలని నేతలు కృషి చేస్తుంటారు. గత కొంత కాలంగా కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అంతే కాకుండా అన్ని చోట్ల ఒకేసారి ఎన్నికలు జమిలి పద్దతిలో జరగాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రధాన మంత్రి మోడీ అలాగే బీజేపీ ముఖ్య నేత అమిత్ షా పలు మార్లు ఈ విషయంపై చర్చలు కూడా జరిపారు. కొన్ని రాష్ట్రాల్లో నాయకులు ముందే సిద్ధమవుతున్నారు కూడా.

తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూడా నేతలలో పలుమార్లు ఈ విషయం గురించి మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లో ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు తెలంగాణకి సూచించిన విధంగా ఆంధ్రప్రదేశ్ కి కూడా వర్తిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఉప ఎన్నికల్లోవరుసగా టీడీపీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జమిలి ఎన్నికల్లో కూడా మరింత బలాన్ని పెంచుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది. ఇటీవల అమరావతిలో నిర్వహించిన టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు జమిలి ఎన్నికల గురించి వివరణ ఇచ్చారు. ఇక బీజేపీ భయం వల్లే జమిలి ఎన్నికలు అంటోందని, వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతుందనే భయంతో ఈ తరహా ఎన్నికలు తెరపైకి వచ్చినట్లు ఏపి ముఖ్యమంత్రి తెలిపారు. ముందస్తు ఎన్నికల విషయంలో అయితే ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అయితే జమిలి పద్దతిలోనే అన్ని స్థానాల్లో ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments