జగన్ కు జైలు భయం చుట్టుకుంది: చంద్రబాబు

Monday, May 28th, 2018, 08:26:22 AM IST

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – వైసిపి ల మధ్య పోరు ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ ఓ వైపు తన ప్రజా యాత్రతో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు చంద్రబాబు మహానాడు వేదికగా కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా జగన్ కేసుల విషయంలో చంద్రబాబు రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో ప్రత్యేకహోదా బీజేపీ ని ఎదిరించిన శశికళ జైలుపాలయినట్టు తనని కూడా ఎక్కడ జైల్లో పెడతారో అనే భయంతోనే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన ప్రధాని ఇంటికి కార్యాలయానికి వెళుతుంటే దర్యాప్తు సంస్థలు మాత్రం ఎలా పట్టించుకుంటాయని చెప్పారు. చాలా వరకు ఈడి సిబిఐ కేసులు వేగం తగ్గాయని, బీజేపీకి మద్దతుగా ఉంటూ వైసిపి లాభం పొందుతుందన్నారు. అదే విధంగా కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ కి వైసిపి మద్దతు పలికిందని అందుకే వారికి ఈ తరహాలో లాభాలు అందుతున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నించకుండా టీడీపీ పై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెబుతూ.. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి చేతులు కట్టుకునే వ్యక్తి తమపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments