పవన్ మొన్నటి వరకు బాగానే ఉన్నారు: చంద్రబాబు

Wednesday, June 6th, 2018, 08:36:36 AM IST

తెలంగాణలో రాజకీయాలు ఓ లెవెల్లో కొనసాగుతుంటే ఆంధ్రలో మాత్రం పరిధులు లేకుండా సాగుతున్నాయి. మూడు వైపుల నుంచి ముగ్గురు నేతలు ఎవరి స్థాయిలో వారు కష్టపడుతున్నారు. ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. వైసిపి నేత జగన్ – జనసేన అధినేత పవన్ రెండే వైపులా సీఎం చంద్రబాబు పై విమర్శలు చేస్తుంటే.. ఆయన తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.

ముఖ్యంగా పవన్ మొన్నటి వరకు బాగానే ఉండి సడన్ గా యూ టర్న్ తీసుకున్నారు అని చంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్‌ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వైసీపీ నేత జగన్ కులాలు మతాలు అంటూ చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. బీజేపీ తో బావున్నంత వరకు పవన్ ఏమి అనలేదు. కానీ వారితో విభేదించగానే పవన్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. వైసిపి నేతలు కూడా హద్దు మీరుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments