ఎవరు పోయినా నేను లెక్క చేయను.. చాలా చూశాను : చంద్రబాబు

Saturday, October 28th, 2017, 02:20:13 AM IST

ప్రస్తుతం తెలనగానలో టిడిపి పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నేతలు చాలా వరకు చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలా ముందుకు వెళతారు అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇలాంటి పరిస్థితులు రావడం సర్వసాధారణమని చెబుతూ.. తాను ఇలాంటివి ఎన్నో చూశానని చెప్పారు.

అంతే కాకుండా పార్టీలో నుండి ఎవరు బయటకి వెళ్ళిపోయినా తాను ఏ మాత్రం లెక్క చేయనని చెప్పారు. కేవలం తనకు పార్టీ కార్యకర్తల బలం అలాగే ప్రజల మద్దతు మాత్రమే ముఖ్యమని చంద్రబాబు తెలియజేశారు. ఇటువంటి పరిణాలమాలు తన హయాంలో చాలా ఎదుర్కొన్నాని చెబుతూ.. మొదట ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవిగా కనిపిస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే చిన్నవైపోతాయని తెలిపారు. ఇక తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం ఖాయమని అందుకు నాయకులు కూడా కలిసికట్టుగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు.