మోడీ పని వెంకన్న చూసుకుంటాడు.. చంద్రబాబు కామెంట్స్!

Saturday, June 2nd, 2018, 11:01:21 AM IST

ఓ వైపు జగన్ మరో వైపు పవన్.. ఇద్దరు కూడా తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేస్తుండడం ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో అసలైన పాలిటిక్స్ వాతావరణం నెలకొంది. జగన్ పవన్ యాత్రలతో పాటు చంద్రబాబు కూడా మీటింగ్ లను నిర్వహించి జనాలకు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేవలం భారత జనతా పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అందిస్తానని చెప్పిన సహాయాన్ని మరిచారని చెబుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ లో ఈ రోజు ఉదయం నవ నిర్మాణ దీక్షను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మాట్లాడిన బాబు మాట తప్పిన మోడీ గురించి ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు అని చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టిన గతి 2019 ఎన్నికల్లో భారత జనతా పార్టీకి కూడా పడుతుందని అన్నారు. వెంకన్న స్వామి అపార శక్తులు ఉన్న దైవం. తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తే వారు అంతూ చూడకుండా వదలదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ విషయంలో బీజేపీ అన్ని తప్పుడు లెక్కలు చూపించిందని 1,500 కోట్లు ఇచ్చి 2,500 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతున్నప్పటికీ ఒక్క లెక్క కూడా చెప్పడం లేదని తప్పుడు ఆరోపణలు చేశారని నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రజలే వారికి సమాధానం చెబుతారని చంద్రబాబు మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments