ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. భ‌య‌ప‌డిన చంద్ర‌బాబు..!

Friday, January 11th, 2019, 01:01:37 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. భారీ అంచ‌నాల‌తో ఈ చిత్రం బుధవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తొలిరోజు నుండే మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకున్నా విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు మాత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అందుకుంది. ఇక ఈ చిత్రం పై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సినిమా చూసిన ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు.

మామ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాన్నిదర్శకుడు క్రిష్, బాలకృష్ణ లతో కలిసి అమరావతిలో చంద్రబాబు సినిమా చూశారు. ఈ సందర్భంగా చిత్రం తీరును వర్ణీస్తూ.. మొద‌ట ఎన్టీఆర్ పాత్ర బాల‌య్య వేస్తున్నాని చెప్పినప్పుడు బాబు భ‌య‌ప‌డ్డాడ‌ట‌. అయితే ఎన్టీఆర్ రూపంలో బాలయ్య నటన ఆహార్యం అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి సన్నివేశంలో ఎన్టీఆర్ మళ్ళీ పుట్టి ఈ వేషాలన్నీ వేశారనే రీతిలో బాలకృష్ణ జీవించారన్నారు. ఇలాంటి సాహసం బాలయ్యకే సాధ్యమ‌ని… ఎన్టీఆర్ జ్ఞాపకాలు, ప్రజలకు అభిమానులకు గుర్తు చేశారని.. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం నుంచి నట ప్రస్థానం, రాజకీయ ప్రవేశం వరకు దర్శకుడు క్రిష్ చక్కగా చిత్రికరీంచారని కొనియాడారు చంద్రబాబు. బాలయ్య చరిత్ర తిరగరాశారని ఎన్టీఆర్ యుగపురషుడు అని తెలుగుజాతి మొత్తం ఈ సినిమా చూడాలన్నారు చంద్ర‌బాబు కోరారు.