దేవాన్ష్ ను అందుకే తీసుకువచ్చా : చంద్రబాబు

Wednesday, September 12th, 2018, 05:18:18 PM IST

గత కొన్నేళ్లుగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఎలాగైనా 2019 నాటికి పోలవరం ప్రాజక్టును పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం గ్యాలరీని మొదలు పెట్టిన సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. మనవడు దేవాన్ష్ పోలవరం ప్రాజెక్టు దగ్గర స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

అయితే ప్రాజెక్టు దగ్గరకు మనవడు దేవాన్ష్ ని తీసుకురావడానికి గల కారణాన్ని కూడా సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరం. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరు ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును సందర్శించాలి. పోలవరం ప్రాజెక్టును చుస్తే అందరికి ఒక అవగాహనా ఏర్పడుతుంది. చిన్నపిల్లలు కూడా ఈ ప్రాజెక్టును సందర్శిస్తే భవిష్యత్తులో ఒక స్ఫూర్తి ఉంటుంది. అందుకే దేవాన్ష్ ను కూడా ఇక్కడికి తీసుకు వచ్చాను’ అని చంద్రబాబు తెలిపారు. అదే విధంగా పోలవరం అనేది ఒక చరిత్ర అంటూ.. ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్రలో భాగస్వామ్యులు అవ్వాలని సీఎం కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments