ఎన్టీఆర్ ఇమేజ్… చంద్రబాబు వాడుకుంటాడా! లెక్కేంటి?

Monday, September 25th, 2017, 12:15:36 AM IST

జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్… ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది. జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరొక్క సారి అందరికి పరిచయం అయ్యింది. ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చుతూ అప్పుడే తెలుగు ఇండస్ట్రీకి సీనియర్ తర్వాత జూనియర్ మాత్రమె లెజెండ్రీ యాక్టర్ అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. ఇక ఆయన నట వారసత్వం తీసుకునేది తారక్ మాత్రమె అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరో వైపు తారకరాముడు పెట్టిన టీడీపీ పార్టీని నడిపించే స్తత్తా కేవలం తారక్ కి మాత్రమె ఉందని. రానున్న రోజుల్లో ప్రజల మధ్య బలపడుతున్న పవన్ కళ్యాణ్ జనసేనని తట్టుకోవాలంటే ఎలాంటి రిమార్క్ లేని, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న తారక్ వలెనే సాధ్యం అనే మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. జై లవకుశ సినిమా తారక్ కి నటుడుగా ఎ స్థాయికి తీసుకెల్తుందో తెలియదు గాని, అతనిలోని నాయకుడుని అందరికి పరిచయం చేసింది. తారక్ లో నిజమైన నాయకుడే జై పాత్రలో అందరికి కనిపించాడని కూడా ఇప్పుడు చెప్పుకోవడం మొదలుపెట్టారు.

ఇలాంటి పరిస్థితిలో మరో రెండేళ్ళలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరు ఊహించడం కష్టం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే అధికార టీడీపీ పార్టీ మీద ప్రజల విశ్వాసం తగ్గుతుంది. అధినేత చంద్రబాబు మాటల ధోరణిలో వచ్చిన మార్పు, ప్రజలతో అతని మాట్లాడే విధానం కాస్తా రాజకీయ అడ్డుగోడలు దాటిపోతుంది . అతను మంచి నాయకుడు అని గత ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓటు వేసారు. కాని ప్రజల నమ్మకం అందుకోవడంలో చంద్రబాబు చాలా చోట్ల విఫలం అయ్యాడు అనేది ప్రజల మాట. ఇలాంటి పరిస్థితిలో మరల టీడీపీ పార్టీ పుంజుకోవాలంటే, టీడీపీ ఓటు బ్యాంకు కాపాడుకోవాలంటే పార్టీని నడిపించేందుకు బాబు తర్వాత బలమైన నాయకుడు కావలి. దాని కోసం చంద్రబాబు చాలా రోజుల నుంచి చూస్తున్నాడు.

గతంలో ఏవో కారణాల వలన జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు కాస్తా దూరం పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. వారి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. అయితే టీడీపీ పార్టీ ప్రభావం తగ్గుతున్న ఇలాంటి పరిస్థితిలో పార్టీకి తారక్ లాంటి బలమైన నాయకుడు కావాలి. ఇప్పటికే తారక్ తన సినిమాల ద్వారాగాని, అలాగే తన వ్యక్తిత్వం ద్వారాగాని జనాలకి భాగా చేరువైపోయాడు. తారక్ లో అందరు సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం చంద్రబాబుకి కూడా కాస్తా క్లేరిటి వచ్చింది. జై లవకుశ హిట్ తో తాను వన్ మెన్ ఆర్మీ అని తారక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో టీడీపీని నిలబెట్టేందుకు, ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు చంద్రబాబుకి మరల తారక్ పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని కాస్తా నియంత్రించాలంటే తారక్ కి మాత్రమె సాధ్యం అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి బాబు, తారక్ కి టీడీపీ భవిష్యత్తుకోసం ఉపయోగించుకుంటాడా. తారక్ టీడీపీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడా అనేది ఇప్పుడు అందరికి పెద్ద ప్రశ్నగా ఉంది.

Comments