హోదాకోసం సైకిలెక్కిన బాబు..

Friday, April 6th, 2018, 01:54:44 PM IST

కేంద్రం ఏపీ పట్ల చూపిస్తున్న వైఖరి రోజు రోజుకూ తీవ్ర ఉదృత స్థాయికి దారితీస్తుంది. ఎప్పుడు ఎలాంటి ఆందోళనలు జరుగుతాయో, ఎవరు నిరసన చేస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో తెలియడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలంతా తమ నిరసనను మరింత ఉదృతం చేయాలని ఆలోచనతో ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలంలో ఉన్న వెంకటాపాలెం గ్రామంలో చంద్రబాబు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పార్టీ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఏపీ పట్ల మోదీ వైఖరి మారకుంటే, కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆయన హెచ్చరించారు.