చంద్రబాబు దీక్ష విరమణ…

Monday, February 11th, 2019, 10:27:02 PM IST

నేడు ఢిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవంతంగా ముగిసింది. దీక్ష చేపట్టిన చంద్రబాబు కు మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేపించారు. నేడు ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చున్న చంద్రబాబు… రాత్రి 8 గంటలు దాటిన తర్వాత దీక్ష విరమించారు. చంద్రబాబుతో పాటు దీక్షలో కూర్చున్న ఇతర నేతలందరికీ కూడా తానే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దాదాపుగా 12:30 గంటలపాటు ఈ దీక్ష కొనసాగింది. బీజేపీయేతర పార్టీల నేతలంతా వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఉన్నారు. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఫరూక్ అబ్దులా, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్.. తదితర నేతలు చంద్రబాబు దీక్షకు సీంఘీభావం తెలిపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. కేంద్రంపై పోరాటంలో తాము కలిసివస్తామని ముఖ్త ఖంఠంతో చెప్పారు.