హమ్మయ్య.. జనసేనానికి టెన్షన్ తగ్గింది..!

Sunday, December 3rd, 2017, 05:59:34 PM IST

కాపు రిజర్వేషన్ల అంశంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం విన్నతరువాత జనసేన వర్గాల రెస్పాన్స్ ఇది. ఆ పార్టీ వర్గాలు ఇప్పుడు రిలాక్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా కులం కార్డుని జనసేనాని తగిలించడానికి కొందరు నేతలు రెడీగా ఉన్నారు. రాజకీయ వర్గాలు కూడా కులప్రాతిపదిక అంశం వచ్చినపుడు పవన్ ని కాపు వర్గానికి చెందిన నేతగానే చూస్తున్నారు. తనని కులాలకు అతీతంగా చూడాలని పవన్ ఎన్నిసార్లు విన్నవించుకున్నా అది జరగడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కాపు రిజర్వేషన్ల గురించి ప్రశ్న ఎదురవుతుంది.

సున్నితమైన ఈ అంశంపై సమతూకంగా మాట్లాడాలి. లేకుంటే తేడాలు రావడం ఖాయం. కాపు ఉద్యమానికి మద్దత్తు పలకాలని ఆ సామజిక వర్గ నేత ముద్రగడ గతంలో బహిరంగంగా కోరారు. కాపు రిజర్వేషన్ల అంశం జనసేన కు లోలోపలే పెద్ద తలనొప్పి. ఇప్పుడిప్పుడే నిర్మాణం జరుగుతున్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఓ సవాల్ లాంటిదే. కానీ ఇటీవల ఎపి క్యాబినెట్ కాపు లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జనసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య తమ అధినేత మెడకు చుట్టుకోకుండా పరిష్కారం అయిందని ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments