బాబు డెసిషన్ తో జగన్ కి బిగ్ ట్రబుల్..!

Sunday, December 3rd, 2017, 06:47:19 PM IST

ఓ వైపు పోలవరంపై ఉడుకెత్తిపోయే చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పనిచేస్తోంది. మిత్రపక్షమే పోలవరం విషయంలో టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఎటువంటి నాయకుడికైనా ఒత్తిడి సహజం. కానీ ఆ సమయంలో బాబు పొలిటికల మైండ్ పాదరసంలా పనిచేసిందని టీడీపీ క్యాడర్ నుంచి కాంప్లిమెంట్లు వస్తున్నాయి. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయమే చంద్రబాబు రాజకీయ చతురతకు అద్దం పడుతుందని అంటున్నారు. సాధారణంగా కాపు రిజర్వేషన్ల డిమాండ్ పై ముద్రగడ ఉద్యమం చేస్తున్నారు. వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తే ఊరుకునేది లేదని బిసి నాయకులు రెడీగా ఉన్నారు.

అనుకున్నట్లుగానే ఏపీ క్యాబినెట్ నిర్ణయం తరువాత బిసి నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కానీ అది టీడీపీ కి డ్యామేజ్ కలిగించేంత కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. అసలు డ్యామేజ్ జగన్ పార్టీకే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల హామీ బాబు నెరవేర్చకుంటే వారి మద్దత్తు వైసిపికే ఉంటుందని ఆపార్టీ వర్గాలు భావించాయి. కానీ చంద్రబాబు సడెన్ గా తీసుకున్న నిర్ణయంతో ఎటువైపు మాట్లాడాలో తెలియక జగన్ సైతం డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన నిర్ణయంతో అటు ముద్రగడకు, ఇటు వైసీపీకి ఇద్దరికీ చెప్ పెట్టినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments