బాబు టూర్ ఫ్లాపేనా ?

Monday, October 29th, 2018, 01:10:42 PM IST

“నారా చంద్రబాబు నాయుడు” ఇటు రాష్ట్ర రాజకీయాల్లో, అటు దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎదో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ దాదాపు పాతికేళ్లుగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వినిపించే పేరు. దేశంలోని సీనియర్ నాయకుల్లో ఒకరు, దాదాపు 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం. అంతటి ఘనత ఉన్న చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన ఆశించిన స్థాయి లో ఫలితం ఇవ్వలేదనీ టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే ఈ ఢిల్లీ పర్యటనతో బాబు దేశ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించే దిశలో అడుగులేస్తున్నారని, బాబు అనుకూల మీడియా ఊదరగొడుతుంది. అయితే ఢిల్లీ పరిస్థితి చుస్తే ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు లాంటి దేశంలోకెల్లా సీనియర్ నేత ఢిల్లీ వెళ్తే రాజకీయ ప్రముఖులంతా ఆయన్ని కలవటానికి ఆసక్తి చూపించకపోగా, అందుకు ముఖ్య నేతలు ఎవరు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తుంది. కేజ్రీవాల్, కాశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, మాయావతి మినహాయించి బాబు వైపు ఇంకెవరు తొంగిచూడకపోవటం విశేషం.

దీంతో చేసేదేమి లేక బాబు దగ్గరికి వచ్చిన వారితోనే కాసేపు ముచ్చట్లు పెట్టి, మీడియా ముందుకు వచ్చి ఎప్పటిలానే మోడీ విమర్శించి ఢిల్లీ టూర్ మమ అనిపించారు. జాతీయ మీడియా సైతం బాబు మాటలకూ, అయన ప్రెసుమీట్ కు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చునట్టు కనపడలేదు. ఆడటుంచితే, జాతీయ నాయకులూ ఎవరూ బాబుని కలవడానికి ఆసక్తి చూపకపోవటం వెనక అసలు కారణం బాబు వైఖరి మీద వాళ్లకు నమ్మకం లేకపోవటమే అని తెలుస్తుంది.

బాబు ఏపుడు ఎలా స్పందిస్తారో తెలీదని, ఆయన వకాశవాద రాజకీయాలకు కూడా అంతే లేదని జాతీయ నాయకుల మాటగా తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో మోడీతో జతకట్టి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్డీయే నుండి తప్పుకొన్నదని, రేపటి నాడు మోడీ మల్లి అధికారంలోకి వస్తే, బాబు మల్లి మోడీ చెంత చేరినా ఆశ్చర్యం లేదని జాతీయ నాయకులూ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందువల్లే బాబుకు ఢిల్లీ మునుపాటి ఆదరణ లేదని, ముఖ్య నాయకులూ ఎవరూ ఆశించిన రీతిలో స్పందించలేదని తెలుస్తుంది. మొత్తంమీద బాబు ఢిల్లీ ప్లాప్ గా మిగిలిపోయింది అన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments