చంద్రబాబు ఢిల్లీ ప్లాన్.. ఆ విషయాన్నీ వదిలేలా లేరు!

Monday, April 2nd, 2018, 01:19:00 PM IST

అందరు ప్రత్యేక హోదా కావాలని అంటే మొన్నటివరకు ఎందుకు కావాలి అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సడన్ గా మాట మార్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రంపై ఒత్తిడి పెంచడం చివరికి బీజేపీతో తెగ దెంపులు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే లోక్ సభలో టీడీపి ఎంపిలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసిన బాబు వారితో పని కాకపోవడంతో తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు. ప్రత్యేక హోదా కోసం టీడీపి ఎంపీలు చాలా కష్టపడ్డారు గాని సభలు వాయిదా పడటం తప్ప అక్కడ ఒరిగిందేమి లేదు.

దీంతో చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్కడ కేంద్రం పెద్దలతో చర్చలు జరిపి రాష్ట్ర పరిస్థితి గురించి వివరించనున్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకోసమే.. రాజకీయ లబ్ది కోసం ఢిల్లి వెళ్లడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఇటీవల ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తరువాత అక్కడ పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాష్ట్ర పరిస్థితిని ప్రముఖ పార్టీలకు వివరిస్తాను. ఓ వైపు కాంగ్రెస్ అన్యాయం చేసింది. మరో వైపు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో బీజేపీ మోసం చేసింది. ఎంపీలు ఏ మాత్రం సైలెంట్ అవ్వకుండా రాష్టానికి రావాల్సిన సహాయం కోసం పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలు పేద ప్రజల సంక్షేమాల పథకాల గురించి ఆలోచించాలని తెలిపారు. అదే విధంగా వైఎస్సార్ పార్టీ ప్రవర్తిస్తోన్న తీరు ప్రజలకు అర్డంమయ్యిందని, ఆ పార్టీ నాయకులు పార్లమెంట్ చివరి రోజున రాజీనామాలు అంటున్నారు. ఎన్నికలంటే వారికి భయం. అందుకే అలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.