చంద్రబాబు దీక్ష సక్సెస్: జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

Tuesday, February 12th, 2019, 12:41:03 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి క్నాద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ బాబు దీక్షకు మద్దతు తెలిపాయి, దీంతో ధర్మపోరాట దీక్ష గ్రాండ్ సక్సెస్ అయినట్లే అయ్యింది, ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది. దీక్ష సందర్బంగా ప్రధాని మోడీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు, ఆ మాటకొస్తే గత ఏడాది నుండి చంద్రబాబు మోడీపై సమయం దొరికినప్పుడల్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీపై గతంలో కాంగ్రెస్ మీద ఉన్నంత కోపమే ప్రజల్లో కూడా ఉంది, ఈ పరిస్తుతుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు ప్రజల్లో కావాల్సినంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఐటీ దాడులు, సిబిఐ విచారణలు జరుగుతాయన్న భయాన్ని కూడా లెక్కచేయకుండా కేంద్రాన్ని వ్యతిరేకించటం ఒక ఎత్తైతే, బాబూ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు అడగకుండానే బీజేపీయేతర పక్షాలన్నీ మద్దతు పలకడం ఇంకో ఎత్తు, ఈ విషయం బాబు అండ్ కో గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

ఇక ప్రతిపక్షాలకు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము దైర్యం లేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా నిజమేమో అన్న భావన ప్రజల్లో గట్టిగ ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి దగ్గరగా మసులుకుంటున్నారు అన్న ఆరోపణ కూడా జగన్ కు పెద్ద మైనస్ ఆయేలా ఉంది. వాస్తవానికి జగన్ మొదటి నుండి ప్రత్యేక హోదా గురించి నినదిస్తున్నప్పటికీ, తాను కేంద్రంపై పోరాడుతున్నాన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు జగన్. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారు, ఎవరు సాధిస్తారు అన్న అంశాలే కీలకం కానున్న నేపథ్యంలో ధర్మపోరాట దీక్ష సక్సెస్ అవటం చంద్రబాబు అండ్ కో లో ఉత్తేజం నింపగా, వైసీపీ శ్రేణులను ఆలోచనలో పడేట్లు చేసింది. జగన్ గనక తేరుకొని బాబు ఎత్తులకు పైఎత్తు వేయకపోతే సీఎం కావాలన్న కల కలగానే మిగిలేలా ఉంది.