బీజేపీ దొడ్డిదారి ఆ పార్టీలే.. చంద్రబాబు వెరైటీ కామెంట్స్!

Wednesday, September 5th, 2018, 11:27:16 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రత్యర్థి పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చొరబడేందుకు ప్రయత్నం చేస్తోందని అందుకు దొడ్డిదారిని ఎంచుకుంటుందని అన్నారు. ఆ దొడ్డి దారులు వైసీపీ జనసేన పార్టీలే అని కామెంట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సీఎం ప్రస్తుత రాజకీయాల గురించి వివరణ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న వైసిపి ఒక వెన్నుముక లేనటువంటి పార్టీ అని అన్నారు.

ఇక రాష్ట్ర క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే యుద్ధం క్షేత్రం నుంచి వైసీపీ పారిపోయిందని చెప్పారు. తెలుగు దేశం అవిశ్వాస తీర్మానానికి 126 మంది ఎంపీలు మద్దతు ప్రకటించారని. రాష్ట్రం కోసం పోరాడుతున్న టీడీపీ పార్టీకి అందరూ అండగా నిలవాలన్నారు. ద్రోహం చేస్తూ బీజేపీకి మద్దతుగా నిలిచిన వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు తెలిపారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపు చరిత్రాత్మకమని కొందరు అధికారులు నాయకులు పనిచేయకపోవడం వల్ల ఆ కోపం పార్టీపై చూపించకూడదని చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments