సచివాలయంలో చంద్రబాబుకు ఘోర అవమానం.. ఎంగిలి ఆకుల మధ్య..!

Monday, September 25th, 2017, 10:25:25 PM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు ఏపీ సచివాలయంలోనే. ప్రభుత్వాధినేతగా ఉన్న బాబుకే ఇలా జరగడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సోమవారం సచివాలయంలోని నాలుగవ బ్లాక్ లో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అధికారులు తినడానికి స్నాక్స్ అందించారు. వాటిని ఆరగించిన అధికారులు నిర్లక్ష్యంగా చంద్రబాబు చిత్ర పటంపై వేసి వెళ్లారు.

అధికారుల సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఆ గదిలో చంద్రబాబు మరియు ఇతర ప్రముఖుల ఫొటోలతో పాటు దేవుళ్ళ చిత్ర పటాలు కూడా ఉన్నాయి. వాటిని గోడలకు తగిలించకుండా అక్కడే ఉంచేసినట్లు తెలుస్తోంది. వాటిని గమనించలేదో లేక ఉద్దేశ పూర్వకంగా జరిగిందో తెలియదు కానీ.. చంద్రబాబు చిత్ర పటంపై అధికారులు తిన్న పేపర్ ప్లేట్ లని చెత్తని పడేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకీ సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాధినేతకే గౌరవం లభించకుంటే ఎలా అని సచివాలయ ఉద్యోగులు మండి పడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు.

  •  
  •  
  •  
  •  

Comments