చంద్రబాబు సొంత జిల్లా వారికే న్యాయం చెయ్యట్లేదు : పవన్ కళ్యాణ్

Tuesday, May 15th, 2018, 08:07:48 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా తిరుమల పర్యటనలో వున్న విషయం తెలిసిందే. కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు చేరుకున్న ఆయన నేడు వెంకన్న దర్శనం అనంతరం శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లి అక్కడ స్థానిక దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించారు. అక్కడినుండి ర్యాలీగా చిత్తూర్ ప్రవేశించిన ఆయన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అసలు సొంత జిల్లాకే ఏమాత్రం న్యాయం చేయలేని చంద్రబాబు ఇంక రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని మండిపడ్డారు. చిత్తూరు లోని హై రోడ్ వెల్ఫేర్ అప్షన్ బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చబుద్రబాబుకి ఇక్కడి సమస్యలుపట్టావా, స్థానిక భూనిర్వాసితులు సమస్యలతో అల్లల్లాడుతుంటే ఆయన చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

విదేశాల నుండి వచ్చే వారికి మాత్రం వందల ఎకరాలు భూములు ఇస్తున్న ప్రభుత్వం సొంత జిల్లా వాసులకు మాత్రం ఎందుకు న్యాయం చేయదని మండిపడ్డారు. అంతే కాదు ఇటీవల శ్రీకాళహస్తి, విజయనగరం, నంద్యాలలో ఇచ్చిన నష్టపరిహారాలు చిత్తూరు జిల్లా వాసులకు ఎందుకు ఇవ్వడం లేదు అని అన్నారు. స్థానిక సమస్యలపై చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదని, పోనీ వున్న స్థానిక నేతలైనా సమస్యలు ఆయన వరకు తీసుకువెళితే బాగుంటుంది. కానీ వాళ్లలో వాళ్ళే అన్నీ పంచుకుంటున్నారని, తమ పార్టీనేతలకి బాబు రాష్ట్రాన్ని తాకట్టు కొద్దికొద్దిగా రాసి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా జిల్లాలో వున్న ఇతర పలురకాల సమస్యలపై స్థానికులు పవన్ కు నివేదించారు. ప్రజలకు మేలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తారనే ఆనాడు చంద్రబాబుకు మద్దతిచ్చానని, అవి నెరవేర్చని పక్షంలోనే ఆయనను ప్రశ్నిస్తున్నాని పవన్ అన్నారు ……

  •  
  •  
  •  
  •  

Comments