ఢిల్లీలో దీక్ష చేసి బాబు సాధించిందేమిటి..?

Tuesday, February 12th, 2019, 03:10:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే, విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిర్మాణంలో సాయం వంటి హామీలు నెరవేర్చనందుకు దీక్షకు పూనుకున్నారు చంద్రబాబు. అయితే ఢిల్లీ దీక్ష సందర్బంగా జరిగిన సీన్లన్నీ గమనిస్తే రాష్ట్ర సమస్యల పట్ల బాబు అండ్ కోకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. దీక్ష చేసిన చంద్రబాబుతో సహా ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ జాతీయ పార్టీల నాయకులంతా మోడీపై తిట్ల దండకం అనూద్కోవటంతో ధర్మపోరాట దీక్ష కాస్తా మోడీని తిట్టటానికే పెట్టిన దీక్షగా మారింది. ఎంత సేపు ఒకరినొకరు పొగుడుకోవటం, మోడీని తిట్టటం తప్ప ఆంధ్రప్రదేశ్ కు జరగాల్సిన న్యాయం గురించి ఇటు చంద్రబాబు కానీ, అటు మద్దతు తెలిపిన జాతీయ నాయకులు కానీ ప్రశ్నించలేదు సరికదా కనీసం వాటి ప్రస్తావన కూడా తేలేదు.

గత ఏడాది కిందట చంద్రబాబుకు హఠాత్తుగా ప్రత్యేక హోదా గుర్తొచ్చింది, అప్పటి నుండి దాదాపు ప్రతిరోజూ మోడీని తిట్టమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు, ధర్మపోరాట దీక్ష అంటూ జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాల మద్దతైతే కూడగట్ట గలిగారు కానీ, వారి నుండి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ అయితే తీసుకోలేకపోయిరు. అక్కడికి వచ్చిన వారు మోడీ తిట్టమే పనిగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కోట్ల కొద్దీ ప్రజాధనం తగలేసి చంద్రబాబు చేసిన దీక్ష వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగినట్లు? చంద్రబాబు అండ్ కో, నిత్యం ఆయన భజన చేసే “కమ్మ”నైన అను”కుల” మీడియా రాష్ట్ర ప్రజానీకానికి కాస్త సెలవిస్తే బాగుంటుంది.