చూడండి.. పూర్తిగా సహనం కోల్పోయిన చంద్రబాబును చూడండి !

Friday, December 7th, 2018, 04:48:47 PM IST

ఈమధ్య ఏపీ సిఎం చంద్రబాబు నాయుడికి సహనం తగ్గుతోంది. న్యాయం చేయాలంటూ ఎవరైనా ఆయన ముందు నిరసన చేస్తే అస్సలు సహించలేకపోతున్నారు. వారిపై నోరు పారేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని స్పాట్లోనే పోలీసులతో ఈడ్చి అవతల పారేయిస్తున్నారు. నిన్న తిరుపతిలో కూడ ఇలానే ప్రవర్తించారు ఆయన.

తిరుపతి బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా కొంతమంది యువత డిస్సీ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీచేయాలని, అధికారంలోకి ఇన్నేళ్లు కావొస్తున్నా టీడీపీ ప్రభుత్వం 20000 పోస్టులు ఉండగా కేవలం 7000 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోందని తమ గోడును ముఖ్యమంత్రికి తెలిపే ప్రయత్నం చేశారు. ఇదే బాబుకు నచ్చలేదు. నిరసనను గుర్తించిన ఆయన వెంటనే మైక్ అందుకుని మీకు బుద్దుందా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, క్రమశిక్షణ లేని జీవితం మీకు వృథా, ప్రభుత్వం మీ ఒక్కరి కోసం పనిచేయడానికి సిద్ధంగా లేదు అంటూ చిందులు తొక్కారు.

న్యాయం చేస్తాడని, ఏదైనా హామీ ఇస్తాడని అక్కడకు వచ్చి నిరసన ప్రయత్నం చేసిన యువత మొత్తం బాబు మాటలకు, పోలీసుల చర్యలకు అవాక్కై మీడియా ముందు బాబు వస్తే జాబ్ అన్నారు, ఆయన కొడుక్కి మాత్రం జాబ్ వచ్చింది, రోజుకి ఒక పూట తిని రెండు పూటలా పస్తులుంటున్నాం అంటూ తమ ఆవేదనను వెళ్లగక్కారు.