బ్రేకింగ్ న్యూస్ : చనిపోయింది మీ ఇంట్లో, విషయాన్ని దాచింది మీరు – చంద్రబాబు

Friday, March 15th, 2019, 10:43:14 PM IST

వైసీపీ నేత , మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణం విషయానికి స్పందించిన, మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు… వివేకానంద రెడ్డి గారి మరణ వార్త విన్నప్పుడు చాలా బడా కలిగింది. ఈ విషయాన్నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వివేకానంద గారి మరణ వార్తను వైసీపీ నేతలే తప్పుదారి పట్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

‘‘మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని, తరువాత ఎవరో వెనక తలుపులు తీసుకోని లోపలికి వెళ్లారని చెప్పారు. అంటే సాధారణ మరణం నుండి హత్య వరకు మార్చారు. కాగా ఘటనాస్థలం వద్దకు సాధారణంగా ఎవరూ వెళ్లకూడదు. కానీ బెడ్‌రూమ్‌లో తలకు గాయమైందని గుడ్డ కట్టారు. సీఐ వెళ్లేలోపు రక్తం కూడా కడిగేశారు. వివేకా శరీరంపై బలమైన గాయాలున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు విషయం ఎందుకు దాచారు? మృతదేహం చూసిన ఎవరికైనా హత్య అని తెలుస్తుంది. అసలు బెడ్‌రూమ్‌ ఎందుకు శుభ్రం చేశారు.

అంతేకాకుండా ఈ విషయంలో తన మరణానికి మాకు సంబంధం ఉందని పుకార్లు లేపారు. మీకెలా తెలుసనీ చంద్రబాబు ప్రశ్నించారు. సహజ మరణం ఎలా ఉంటుంది, హత్య ఎలా ఉంటుందో మీకు ఆ మాత్రం తెలియదా… అసలు అవినాశ్‌రెడ్డికి హత్య విషయం ఎవరు చెప్పారు? వివేకా హత్యలో సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. మీ ఇంట్లో హత్య జరిగితే ఇతరులపైకి నెడుతున్నారు. దారుణ హత్యకు గురైతే ముందే ఎందుకు చెప్పలేకపోయారు?’’ అని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.