తెలంగాణ సీట్ల విషయంలో కాంగ్రెస్ కు తలొగ్గిన బాబు !

Tuesday, October 23rd, 2018, 01:00:20 AM IST

మహాకూటమి సీట్ల సర్దుబాటై విషయమై పార్టీ నేతలతో చర్చిండానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ-టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఆసాంతం బాబు తెలుగు తమ్ముళ్లకు సర్దుకుపోవాలనే చెప్పినట్టు తెలుస్తోంది.

కూటమి ఏర్పాటు సమయంలో ఎలా కాదన్నా కనీసం 30 చోట్ల పోటీ చేయాలని, అందులోని తమకు బలముందని భావిస్తున్న ప్రతి నిరయోజవర్గంలోనూ టికెట్ సాదించాలని తెలుగు తమ్ముళ్లు అంచనాలు వేసుకున్నారు. కానీ మహాకూటమి పెద్ద కాంగ్రెస్ మాత్రం అవేవీ కుదరవని, కేవలం 12 సీట్లు మాత్రమే ఇస్తామని తేల్చింది.

దీంతో ఖంగుతిన్న తెలుగు తమ్ముళ్లు బాబు తమ తరపున మాట్లాడి ఇంకొన్ని సీట్లు ఇప్పిస్తారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆదేశాల్ని పాటించడండి, మనకి సీట్లు కాదు పొత్తు ముఖ్యం, కూటమి గెలిస్తే నామినేటెడ్ పదవులు ఎలాగూ ఉంటాయి, కాబట్టి సీట్లు దక్కని చోట కూడ కష్టపడి మిత్రపక్షాల అభ్యర్థుల్ని గెలిపించాలని సూచించారట. అధినేతే ఇలా కాంగ్రెస్ మాటకు తలొగ్గడంతో చేసేదేం లేక చేతులు నలుపుకోవడం తెలుగు తమ్ముళ్ల వంతైంది.