లాయర్ కు గంటకు 33 లక్షలు చెల్లిస్తున్న చంద్రబాబు !

Friday, September 14th, 2018, 04:02:46 PM IST

మన రాజకీయ నేతలకు ప్రజల సొమ్మంటే ఎంత నిర్లక్ష్యమో మరోసారి రుజువైంది. ఇటీవలే ఏపి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం 2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము అనగా ప్రజాధనాన్ని ఖర్చు చేయగా తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లాయర్ కు కేవలం గంటకు 33 లక్షలు చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

విడిపోయిన రోజు నుండి ఏపి, తెలంగాణల నడుమ హైకోర్టు విభజన అంశం నలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. చంద్రబాబు అండ్ కో హైకోర్టును విభజించడానికి వీల్లేదని కేసు పెట్టి ఆ కేసును వాదించడానికి సీనియర్ అడ్వకేట్ ఫాలి నారిమన్ ను అపాయింట్ చేసుకున్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 259 ని కూడ జారీ చేశారు బాబు.

ఇంతకీ ఈ అడ్వకేట్ కు మన ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎంతో తెలుసా గంటకు అక్షరాల 33 లక్షలు. ఆయన ఈ కేసు విషయమై ఎన్ని గంటలు కోర్టులో ఉంటే అన్ని 33 లక్షలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. మనవాళ్ళు సమర్పిస్తున్నారు కూడ. ఇప్పటికే ఎన్నో నెలల నుండి నడుస్తున్న ఈ కేసు ఇంకెన్ని నెలలు, సంవత్సరాలు నడుస్తుందో చెప్పడం కష్టం. పంతం మీద ఖర్చు పెట్టే ఈ ప్రజాధనంతో రాజధానిలో దర్జాగా కొత్త హై కోర్టు భవనాన్ని నిర్మించుకొంటే రాష్ట్రం పేరు మీద స్థిరాస్థి ఉన్నట్టైనా ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments