30 కుటుంబాలకు 500 ఇచ్చి కూరగాయలు కొనుక్కోమన్న బాబు..”తిత్లి” బాధితుల ఆవేదన!

Wednesday, October 17th, 2018, 10:39:08 PM IST

శ్రీకాకుళం జిల్లాలో “తిత్లి” తుఫాను వల్ల ఎంత స్థాయిలో నష్టం జరిగిందో అందరికి తెలుసు.ఇప్పటికే ప్రభుత్వం వారు వెంటనే చర్యలు చేపట్టి అక్కడి పరిస్థితులను చక్కదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.రాజకీయ నాయకులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు నటులు,కౌశల్ అభిమానులు కూడా వారికి తోచిన సాయాన్ని అందించారు.అయితే తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత చంద్రబాబు అక్కడికి వెళ్లి అది చేశారు ఇది చేశారు అన్న తెలుగుదేశం నాయకులకు ఇప్పుడు ఈ వార్త షాక్ కి గురి చేసేలా ఉంది.

ఈ రోజు పవన్ శ్రీకాకుళం ప్రాంతానికి అక్కడి ప్రజలను పరామర్శించడానికి వెళ్లగా అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారో చెప్పగా పవన్ షాక్ కి గురయ్యారు.అక్కడ దాదాపు ముప్పై కుటుంబాలు తినడానికి తిండి సరైన అవసరాలకు సరుకులు లేక ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు కేవలం 500 రూపాయలు ఇచ్చి వారిని కూరగాయలు కొనుక్కోమన్నారని బాధితులు పవన్ దగ్గర వాపోయారు.కనీసం ఒక్కో కుటుంబానికి 500 కాకుండా 30 కుటుంబాలకి కలిపి 500 ఇస్తే ఏం చేసుకోవాలని ఆ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.