జగన్ కుమ్మక్కవుతున్నాడు..అవంతి శాంతి..శాంతి..!

Sunday, January 21st, 2018, 11:22:37 PM IST


తెలుగు దేశం పార్టీ నేతలకు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు. విభజన హామీల విషయంలో టీడీపీ నేతలకు గుబులు పట్టుకున్న విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. కేంద్ర విభజన హామీలు నెరవేర్చకుంటే ఆ ప్రభావం మన పార్టీ మీద కూడా పడుతుందని నేతలు చంద్రబాబు ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ హోదాలో ఉన్న మనం విభజన హామీలు సాధించుకోలేదనే అపవాదు భరించాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎన్నికల్లో పడుతుందని అవంతి శ్రీనివాస్ వంటి నేతలు కొందరు చంద్రబాబు ఎదుటే అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబులా మరే ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఇంతలా అభ్యర్థించడం లేదని అన్నారు. కేంద్ర విద్యాసంస్థ లకు 11వేల కోట్ల భూములు ఇచ్చాం. కానీ పరిహారం కింద వారు ఇచ్చింది రూ 150 కోట్లు మాత్రమే. అమరావతి రాజధానికి 30 వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ కేంద్ర ఇచ్చింది 3 వేల కోట్లు మాత్రమే అని అవంతి శ్రీనివాస్ చంద్రబాబు ఎదుటే ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు అవంతి శ్రీనివాస్ ని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పరోక్షంగా జగన్ పై విమర్శలు చేసారు.

ప్రతిపక్షం కేంద్రంతో కుమ్మక్కవుతోంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమే ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే సహనంతో నిధుల్ని సాధించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు అవంతి శ్రీనివాస్ కు వివరించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే ఒరిగేదేమి లేదని అన్నారు. చివరి వరకు ప్రయత్నిద్దాం.. కుదరకుంటే వారిని దూరం పెడదాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.