యన్.టీ రామారావు గారి సూత్రాలకు వ్యతిరేఖంగా బాబు ప్రవర్తన..!

Thursday, November 1st, 2018, 04:27:04 PM IST

తన అద్భుత సినీ ప్రస్థానం నుంచి రాజకీయాల్లోకి అడుగువేసి దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడికి దారి తీసిన వ్యక్తి స్వర్గీయ ”నందమూరి తారక రామారావు” గారు.తాను కేంద్రీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అక్రమాలను అన్యాయాలను ఓర్వలేక రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం పెత్తనం ఉండకూడదని మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి పూర్తి విరుద్ధంగా “తెలుగుదేశం” అనే పార్టీని వ్యవస్థాపించారు.అయితే ఆయన అనంతరం చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు రావడం ఆయన ముఖ్యమంత్రి కావడం అన్ని జరిగిపోయాయి.

ఇవన్నీ బాగానే ఉండగా చంద్రబాబు మాత్రం అసలు రామారావు గారు ఎందుకు పార్టీ పెట్టారో ఆ సూత్రాలు అన్నిటికి విరుద్ధంగా ఇప్పుడు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.మరీ ముఖ్యంగా అయితే తెరాస నేతలు ఈ పాయింట్ ని చూపించి విమర్శలు చేస్తున్నారు.తెలంగాణలోని ఎన్నికల నిమిత్తం టీకాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే,ఇప్పుడు తాజాగా బాబు ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మాట్లాడ్డం పట్ల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అసలు రామారావు గారు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేఖంగా అని అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఏమో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చెయ్యడం ఎంత వరకు సరైనది అని ప్రశ్నిస్తున్నారు.అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments