ఇన్నాళ్ల తర్వాత బాలయ్య, తారక్ ల కలయిక వెనుక చంద్రబాబు హస్తం..?

Sunday, October 21st, 2018, 06:54:08 PM IST

గత కొన్నాళ్లుగా నందమూరి బాలకృష్ణకు మరియు జూనియర్ ఎన్టీఆర్ లకు మధ్యన దూరం ఉన్నదన్న సంగతి అందరికి తెలిసినదే.కారణాలు ఏవైనప్పటికీ ఈ బాబాయ్ అబ్బాయ్ లు ఇద్దరికీ ఆ మధ్య అంతా చిన్న పాటి కోల్డ్ వార్ నడిచింది.ఇప్పుడు ఈ మాటలన్నీ పటాపంచలు చేస్తూ అరవింద “సమేత వీర రాఘవ” సక్సెస్ మీట్ కు ఈ రోజు బాలయ్య హాజరవుతున్నాని తెలిపారు.అయితే ఇది వరకే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకకే హాజరు కావాల్సి ఉండగా అప్పుడు కొన్ని కారణాల చేత హాజరు కావడానికి కుదరలేదు.ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్య బాబుని మరియు తారక్ ని ఒకే వేదిక మీద చూడబోతున్నాం అంటూ వారి యొక్క అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు బాలయ్య తారక్ తో కలిసి వేదిక పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఇన్నాళ్ల తర్వాత బాలయ్య తారక్ ను కలవడం వెనుక చంద్రబాబు యొక్క కీలక పాత్ర ఉంది అని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే చంద్రబాబుకు పవన్ దూరం కావడం అది చాలదన్నట్టు పవన్ తీవ్రమైన వ్యతిరేకతను తీసుకురావడం వంటివి టీడీపీ కి బాగా దెబ్బేసాయి.ఇప్పుడు ఈ లోటుని తారక్ తో పూడ్చాలని బాబు గారు ఈ సారి తన ఎన్నికల ప్రచారానికి తారక్ సాయం తీసుకోబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలొచ్చాయి.అందుకోసమే బాలయ్య కూడా ఒకడుగు ముందుకేశారని,తెలుస్తుంది.ఈ మాటలు వార్తల వరకు పరిమితమేనా లేకా నిజంగానే తారక్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో మైక్ పెట్టుకుంటారా అన్నది ఎన్టీఆరే వెల్లడించాలి.

  •  
  •  
  •  
  •  

Comments