బాబుకి డేడ్ లైన్ 15 మే లోపు అంట కదా..?

Sunday, April 29th, 2018, 02:50:58 AM IST

రోజురోజుకి రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయడం కష్టతరమవుతుంది. నిన్న ఒక పార్టీలో ఉన్న నేత నేడు ఇంకే పార్టీలో ఉంటాడన్నదీ అనుమానంగా మారింది. ఈ ఫిరాయింపు కార్యక్రమాల మీద కొన్ని సంచలన వాఖ్యలు చేశాడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అంతేకాకుండా టీడీపీ నేతలు ఊచలు లెక్కబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఒక సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ విలేకరులతో మాట్లాడుతూ- పట్టిసీమపై అవకతవకలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలంటే విచారణను జరిపించి రుజువుచేయమని టీడీపీ నేతలు అడుగుతున్నారని, పట్టిసీమ ప్రాజెక్టులో వారు చేసిన గోల్ మాల్ లపై ఒక నివేదికను తయారుచేసి, దానిని సీబీఐకి అప్పగించి టీడీపీ నేతల భరతం పడతానని హెచ్చరించాడు. విచారణను జరిపించమని జూపూడి గారు సరదా పడుతున్నప్పుడు ఆయన సరదాను తీరుస్తానని ఎద్దేవా చేసాడు.
టీడీపీ ఒక వారసత్వ పార్టీ అని, కుటుంబ రాజకీయాలు చేసేపార్టీ అని వాఖ్యలు చేశాడు. టీడీపీ తో తాము పొత్తు పెట్టుకోకున్నట్లయితే మరిన్ని సీట్లు గెలిచే వారిమని తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేదని జోస్యం చెప్పాడు. మే15 లోపు టీడీపీ లోని చాలా మంది నేతలు వైసీపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బాంబు పేల్చాడు. ఈయన మాటలు నిజమోకాదో తెలియదు కాని, ఒకవేళ నిజంగా జారితే బాబుకు కోలుకోలేని దెబ్బ అవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments