జగన్ స్కెచ్ కి ఖంగు తిన్న చంద్రబాబు

Friday, June 7th, 2019, 04:04:31 AM IST

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త రంగు పూసుకుంటున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి జగన్ తన కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నాడు. కాగా చంద్రబాబు ఇటీవల సీఎం జగన్ కి ఒక లేఖ రాసారు. ఉండవల్లి ప్రజావేదికను తన నివాసంగా ఇవ్వమని చంద్రబాబు, జగన్ ని కోరారు. కాగా వైసీపీ నేతలు కూడా తమ పార్టీకి ప్రజావేదిక భవనం కావాలని కోరారు. అయితే చంద్రబాబు ఆ లేఖ ని రాయడం వల్లనే వైసీపీ నేతలు కావాలనే ఈ మెలిక పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక అక్కడికి జగన్ సీఎం హోదాలో వస్తే బాబు గారి నివాసం మొత్తం ట్రాఫిక్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. దానికి తోడు అక్కడ మీటింగ్ లు పెట్టుకొని కాస్త ఇబ్బందిగా మారుతుందని, అందుకనే ఈ విషయంలో జగన్ ఎం మాట్లాడటంలేదని, ఒకరకంగా చంద్రబాబు రాసిన లేఖకు కావాలనే జగన్ స్పందించడం లేదని తెలుస్తుంది.

అయితే ప్రజావేదిక తో పాటు చంద్రబాబు నివాసంకుడా అక్రమ కట్టడమే అని వైసీపీ తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొంది. దాంతో అది ఎపుడు కూల్చేసినా తాము ప్రజావేదికను ఖాళీ చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే వారి ఎత్తుగడని అర్థం చేసుకున్న చంద్రబాబు ఇపుడు ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాబు ఒక ఎత్తు వేస్తే జగన్ మరో ఎత్తు వేసి చిత్తు చేశారు ఇపుడు బాబుకు అమరావతిలో ఇల్లు లేదు. విజయసాయిరెడ్డి అన్నట్లుగా సొంత ఇల్లు లేకుండా ఇన్నాళ్ళు పాలించారా అన్న మాట వినిపిస్తోంది. ఇకపైన అద్దెకు ఉంటారేమో అక్కడ చూడాలి.