కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్.. చంద్రబాబుకు కళ్ళు తిరగడం ఆగిందో లేదో ?

Friday, December 7th, 2018, 05:00:38 PM IST

ప్రచారం చివరి నిముషం వరకు రాష్ట్ర భవిత కోసం చేతులు కలిపాం, కూటమిలో ఎలాంటి స్వార్థాలకు తావు లేదు, ప్రజాక్షేమమే మా ధ్యేయం అన్నట్టు కలరింగ్ ఇచ్చిన కాంగ్రెస్, టీడీపీల నడుమ ఏ స్థాయిలో అంతరాలు ఉన్నాయన్నది బయటపడింది. కూటమిలో పెద్దగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ జన సమితికి తన స్ట్రోక్స్ రుచి చూపగా ఇప్పుడు టీడీపీకే ఘలక్ ఇచ్చింది.

గత కొన్నాళ్లుగా ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న అస్పష్టతకు తేరా దించే క్రమంలో కాంగ్రెస్ టీడీపీకి దెబ్బ వేసింది. మొదటి నుండి ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పొత్తులులో భాగంగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ కు వదిలేసి ఇష్టంలేకున్నా ఇబ్రహీంపట్నం నుండి పోటీకి దిగారు. కనే ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగి బిస్పీ బీఫామ్ తెచ్చుకుని నామినేషన్ వేశారు.

ఇన్నాళ్లు వీరిద్దరిలో ఎవరికీ మద్దతు ప్రకటించని కాంగ్రెస్ పార్టీ నిన్న చివరి నిముషంలో మాల్ రెడ్డినే కాంగ్రెస్ అభ్యర్థిగా భావించి అతనికే ఓటు వేయాలని ప్రజల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి సామకు మైండ్ బ్లాక్ అయింది. అలాగే చంద్రబాబుకు సైతం కాంగ్రెస్ ఇచ్చిన లాస్ట్ మినిట్ మాస్టర్ స్ట్రోక్ కు కళ్ళు తిరిగే ఉంటాయి. వారి ఇష్టం మేరకే ఎల్బీ నగర్లో గెలిచే అవకాశాలున్న సామను ఒప్పించి ఇబ్రహీంపట్నంలో దింపితే చివరికి కాంగ్రెస్ తమ పార్టీ రెబల్ కు సపోర్ట్ చేసి తన అభ్యర్థి ఓటమినే ఆశిస్తుందని ఆయన ఊహించి ఉండరు. మరి నిన్న తగిలిన ఈ స్ట్రోక్ నుండి ఆయన ఇప్పటికైనా తేరుకున్నారో లేదో.