పేదలతో 5 రూపాయల భోజనం చేసిన చంద్రబాబు!

Wednesday, July 11th, 2018, 03:49:57 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని పథకాలతో ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఓ వైపు జగన్ మరో వైపు పవన్ వారి స్టైల్ లో ముందుకు సాగుతుంటే చంద్రబాబు జనాలకు ఆఫర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎప్పటినుంచో ఆలోచిస్తున్న మూడు పూటల ఆహార విధానాన్ని నేడు స్టార్ట్ చేశారు. అన్న క్యాంటిన్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

మూడు పూటల కలిపి 73 రూపాయలకు ఖర్చు చేసి ఆకలి తీర్చుకునే వారికీ కేవలం 15 రూపాయలతో మూడు పూటల ఆహారం దొరుకుతుందని తెలిపారు. మొదట రాష్ట్ర వ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్ల ద్వారా 2.15 లక్షల ప్లేట్ల ఆహారం అందించేవిధంగా కృషి చేస్తామని పూటకు 5 రూపాయల భోజనం చేయవచ్చని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు కొంత మంది పేద ప్రజలతో కలిసి 5 రూపాయల భోజనం చేశారు. అక్షయపాత్ర అనే సంస్థ ఈ పథకానికి సంబందించిన క్యాటరింగ్‌ బాధ్యతలను తీసుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments