బాబు స్ట్రాటజీ కి లొంగిన కాంగ్రెస్…!

Tuesday, November 6th, 2018, 05:50:55 PM IST

తెలంగాణ కాంగ్రెస్ ది ఒక విచిత్రమైన పరిస్థితి, ఆ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే, ఎవరికీ వారు తామే సీఎం అభ్యర్థి అంటూ ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది, రెడ్ల పార్టీగా ముద్ర పడ్డ ఆ పార్టీ లోని రెడ్లకి శఠగోపం పడనుందట, ఇదంతా ఒక్క చంద్రబాబు వల్లే అంట. ఏ రోజైతే టీడీపీ తో పొత్తుకు కాంగ్రెస్ రెడీ అయ్యిందో ఆ రోజు నుండే పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు. అంతా అనుకున్నట్టు ఆ పార్టీ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి లలో ఒకరు కారట. ఇందుకు కారణం ఆ పార్టీలో ఇపుడు అధికార పార్టీని ఢీ కొట్టడానికి అయ్యే ఖర్చు బరించేంత స్తొమత ఉన్న నాయకుడు ఎవరూ లేకపోవటమే అట. ఈ సారి తెలంగాణ లో గెలవాలంటే కచ్చితంగా డబ్బు పెట్టి తీరాలి, ఒకవేల గెలవకపోతే ఆ ప్రభావం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యం లో బాబు రాహుల్ ల మధ్య ఒక ఒప్పందం జరిగినట్టు సమాచారం, ఆ ఒప్పందం ఏమనగా తెలంగాణ ఎన్నికల్లో అవసరమయ్యే ఖర్చు అంతా బాబు చూసుకునేట్టుగా, సీఎం అభ్యర్థి మాత్రం బాబు చెప్పిన వారినే ఎంపిక చేయాలట. అందులోనూ అభ్యర్థి బీసీ క్యాటగిరి కి చెందిన వాడై ఉండాలట, ఏమి చేయలేని పారిస్తుతుల్లో రాహుల్ బాబు ప్రపోజల్ కు ఓకే అన్నారట, ఈ ఒప్పందం ప్రభావం టీడీపీ మీదకంటే కాంగ్రెస్ మీద ఎక్కువ పడనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెడ్లందరిని, జగన్ పార్టీకి అప్పగించిన కాంగ్రెస్, తెలంగాణ లోను బాబు స్ట్రాటెజికి బలవ్వనుంది.ఈ ప్లాన్ ప్రకారం మహాకూటమి అధికారంలోకి వస్తే టీడీపీ కి మాత్రమే ప్లస్ అవుతుంది. మహాకూటమి గెలుపు మాట ఎలా ఉన్న ఈ ఒప్పందం వల్ల ప్రాధాన్యం కోల్పోతున్నాం అని భావించే కొందరు నేతలు కాంగ్రెస్ ని వీడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments