ట్రెండింగ్ పాలిటిక్స్.. ఆగ‌లేక‌పోయిన చంద్ర‌బాబు..!

Friday, January 11th, 2019, 02:00:32 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, తాజాగా ప్ర‌కాశం జిల్లాలో పర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన ఒక సంఘ‌ట‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. రామాయ‌ప‌ట్నం పోర్టులో పైలాన్లను ఆవిష్క‌రించిన చంద్ర‌బాబు ఒక్క‌సారిగా చిన్న‌పిల్లాడైపోయారు. అస‌లే సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో, పిల్ల‌ల‌కు స్కూళ్లు సెవ‌లు ఇవ్వ‌డంతో అక్క‌డ ఆడుకుంటున్న పిల్ల‌ల్ని చూసిన చంద్ర‌బాబు, ఆగ‌లేక పిల్ల‌ల‌తో ఆట‌లు ఆడారు.

ఒక రాష్ట్రానికి ముక్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు, అక్క‌డ‌ చిన్నపిల్లాడిలా మారి, వారితో కలిసి గోళీలాడారు. అలాగే, కర్రాబిళ్ళా, వాలీబాల్, కోలాటం ఆడుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తన చిన్నతనంలో సంక్రాంతి సెలవులు వ‌చ్చిన‌ప్పుడు ఎన్నో ఆట‌లు ఆడే వార‌మ‌ని, ప‌గ‌లంతా ఆట‌పాట‌ల‌తో ఉత్సాహంగా గ‌డిపేవార‌మ‌ని, ఇప్పుడు మ‌రోసారి చిన్న‌పిల్ల‌తో క‌లిసి ఆడ‌డం, చాలా సంతోషంగా ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు. అలాగే సంక్రాతి పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ముగ్గుల పోటీలను కూడా ఆశ‌క్తిగా తిలకించారు చంద్ర‌బాబు. ఇక అలాగే చంద్ర‌బాబు త‌న స‌ర‌దాలు తీర్చుకున్నాక జ‌న్మ‌భూమి, మావూరు స‌భ‌లో పాల్గొన్నారు.