ఆయన స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు చేపట్టాం – చంద్రబాబు

Wednesday, May 15th, 2019, 10:35:48 PM IST

నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించినటువంటి చంద్రబాబు, ఆ తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి, ఇప్పటికే 70శాతం పూర్తి చేశామని, మిగతాది కూడా తొందర్లోనే పూర్తీ చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి కాటన్‌ అని, నీటి విలువ, గొప్పతనం తెలిసిన మహనీయుడు కాటన్ అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తితోనే నీరు – ప్రగతి లాంటి జలసంరక్షణ ఉద్యమాలు చేపట్టామని చంద్రబాబు అన్నారు.

ఇప్పటికి కూడా ఉభయ గోదావరి జిల్లాలను చక్కటి దాన్యాగారాలుగా తీర్చి దిద్దిన ఘనత కాటన్ కె దక్కుతుంది. ప్రస్తుతానికి నిర్మాణ దశలో జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం రాష్ట్రం దశ, దిశ మారుతుందని, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి రూ.44వేల కోట్ల విలువైన పంట దిగుబడి సాధించామని చంద్రబాబు అన్నారు. కాగా త్వరలో వెల్లడవనున్న ఫలితాలతో టీడీపీ అఖండ విజయాన్ని సాదించబోతుందని చంద్రబాబు అన్నారు.