చంద్రబాబు అన్నం పెట్టినవారికే సున్నం పెట్టేరకం : కన్నా

Monday, June 11th, 2018, 05:27:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై బిజెపి నేత కన్నా లక్ష్మి నారాయణ విరుచుకుపడ్డారు. నేడు విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద చేపట్టిన నిరసన కార్యమాల్లో పాల్గొన్న అయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి అన్ని విధాలా నిధులు దోచుకుని, ఇప్పుడేమో మాకు నిధులేమీ రాలేదని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు అన్నారు. అయితే అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు, వాటి దుర్వినియోగంపై తాను బహిరంగపరచడానికి, వాటిపై చర్చించడానికి సిద్దమేనా అని చంద్రబాబుని సవాల్ చేసారు. తాము టీడీపీతో జతకట్టిన సమయంలో చెప్పిన హామీలన్నీ ఇప్పటికే దాదాపుగా నెరవేర్చామని, అయితే చంద్రబాబు మాత్రం మోసపూరితంగా తాను అబద్దాలు చెప్పడమే కాక టీడీపీ నేతలతో కూడా అబద్ధమాడిస్తున్నారు అన్నారు. చంద్రబాబు అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టె రకమని దుయ్యబట్టారు.

ఓవైపు చంద్రన్న భీమా, గృహ రుణ నిర్మాణ పధకాలు, గ్రామాల్లో అభివృద్ధికి ఇస్తున్న నిధులు, అలానే ఎంతో ప్రాముఖ్యతకలిగివున్న పోలవరం నిర్మాణానికి ఇస్తున్న నిధులు ఇలా ప్రతిఒక్కటి కూడా కేంద్రం నుండి తీసుకుంటూనే మరోవైపు మాత్రం వాటికి చంద్రబాబు తన పేర్లు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శించారు. బాబు ఎంత ఘనుడంటే మొదట్లో అవకాశం కోసం కాంగ్రెస్ ని, తరువాత ఆయన మామ ఎన్టీఆర్ ని, ఇక ప్రస్తుతం నరేంద్ర మోడీని మోసం చేసిన గొప్ప చరిత్ర ఆయనది అని మండిపడ్డారు. ఏపీలో బీజేపీని తొక్కిపట్టే ప్రయత్నాలు టీపీడీ చేస్తోందని, అంతేకాక నిజాలు మాట్లాడుతున్న తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇలానే తన ఆధిపత్యంతో ఏపీని పాలించాలని చూస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టిగా తగిన బుద్ధి చెప్పి టీడీపీని ఓటమిపాలు చేస్తారని కన్నా హెచ్చరించారు……

  •  
  •  
  •  
  •  

Comments